ఓ పిల్లాడు రెస్టారెంట్లో టేబుల్ పై డాన్స్ చేసి అదరగొట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వచ్చిన వారు.. అది మరిచి ఆ బుడ్డోడి డ్యాన్స్ ను తిలకించారు. తమ ముందు నోరూరించే ఆహారం ఉన్నప్పటికీ ఆ చిన్నోడి డాన్సు చూస్తూ చప్పట్లలో కేరింతలు కొట్టారు. ఆ గ్రేసు, ఆ స్టెప్పులు అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ, బుడ్డోడిని అభినందిస్తున్నారు. బుల్డోడి డాన్స్ ఎలా ఉందో మీరు చూసేయండి.