ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి జరిగింది. బాధితురాలి ప్రకారం. మల్లెపల్లిలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద మంగళవారం ఓ వ్యక్తి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ అమ్మాయి మరో అబ్బాయితో కలిసి చితకబాదింది. తరచూ అక్కడికి వచ్చే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ మొబైల్ నెంబర్ అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.