జీహెచ్ఎంసీ స్పెషల్ డిప్యూటీ కమిషనర్ తో బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ శుక్రవారం సమావేశమయ్యారు. డివిజన్ పరిధిలోని ఇంజిన్ భౌలి నుంచి బీబీక చస్మా వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులపై చర్చించారు. విస్తరణ పనుల్లో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి త్వరగా పరిహారం అందజేయాలని డిప్యూటీ కమిషనర్ ను ఎమ్మెల్యే కోరారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గడువు లోగా పనులు పూర్తి చేయలన్నారు.