తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

81చూసినవారు
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 6,7 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడనున్నది. అలాగే ఉమ్మడి నిజామాబాద్, సిరిసిల్లా, భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్