
చార్మినార్: జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ ను కలిసిన ఎమ్మెల్సీ
జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ ను ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా పాతబస్తీ పరిధిలోని పలు పెండింగ్ అభివృద్ది పనులపై చర్చించారు. అలాగే నూతన అభివృద్ది పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. వీటికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. వీటిపై చీఫ్ ఇంజనీర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.