చార్మినార్ ఆసుపత్రి వద్ద తరచూ ట్రాపిక్ సమస్యలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నిభందనలు ఉల్లంఘించి రాంగ్ రూట్లో వాహనాలను నడపడం, ఆటోలను రోడ్డుపై పార్క్ చేయడం వలన ఈ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు తెలిపారు. ట్రాపిక్ పోలీసులు వెంటనే స్పందించి ట్రాపిక్ సమస్యలను పరిష్కరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మరోసారి తప్పు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.