చార్మినార్: జలమండలి సీజీఎంతో ఎమ్మెల్సీ సమీక్ష
జలమండలి సీజీఎం వినోద్ భార్గవ్ తో ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ శనివారం సమావేశం అయ్యారు. చార్మినార్ పరిధిలోని వివిధ పెండింగ్ అభివృద్ది పనులు సమస్యలపై చర్చించారు. పనులను త్వరగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ది పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు. వీటిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.