సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం పరామర్శించారు. చిన్నారి శ్రీతేజ్ కు అందుతున్న వైద్యం గురించి ఆయన కిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రేవతి కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.