హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం ప్రారంభించారు. జాంబాగ్ డివిజన్లో స్ట్రామ్ వాటర్ లైన్ పనులు, బేగంబజార్, మంగళహట్ ప్రాంతాల్లో రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ. 33 లక్షలతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చూడాలని అధికారులను రాజాసింగ్ ఆదేశించారు.