ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకున్న బెటాలియన్ కానిస్టేబుళ్ళను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వైపు 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. మరోవైపు పది మందిని ఉద్యోగం నుంచి తొలగించారని వారు అవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏక్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. తమతో సీఎం, డీజీపీలు చర్చలు జరపాలని కోరుతున్నారు.