కరీంనగర్ ఎంపీ, కేంద్రం మంత్రి బండి సంజయ్ ఆదివారం హైదరాబాద్ లోని కిమ్స్ చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ డాక్టర్లతో మాట్లాడి బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని, ఈ ఘటనపై పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలన్నారు.