జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఓ కారు అదుపుతప్పి పుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఉదయం 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసులు ఒంటిగంటకు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం టోయింగ్ వాహనం సహాయంతో స్వల్పంగా ధ్వంసమైన కారును స్టేషన్ కు తరలించారు. కాగా కారు డ్రైవర్ ఆజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని అటుగా వెళ్తున్న వారు తెలిపారు.