సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం

6868చూసినవారు
గండిపేట బండ్లగూడలోని రత్నదీప్ సెలెక్ట్ సువర్ మార్కెట్ లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుకాణంలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్