కార్వాన్: స్మశానవాటిక స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

71చూసినవారు
కార్వాన్ పరిధి ఇబ్రహీం బాగ్ లో గల సర్వే నెంబర్లు 166, 177 లో క్రిస్టియన్ స్మశానవాటిక ఏర్పాటు కోసం స్థలాన్ని కార్వాన్ ఎమ్మేల్యే కౌసార్ మొహియుద్దీన్ శనివారం పరిశీలించారు. రెండు ఎకరాల స్థలాన్ని శ్మశానవాటికకు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎంఐఎం పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ వజీఉజ్జమా తదితరులు పాల్గొన్నారు.