హైదరాబాద్: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ట్వీట్ చేశారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.