హైదరాబాద్: గ్రేటర్లో మోడల్ మార్కెట్లను ఇతర అవసరాల పేరిట ప్రైవేట్ పరం చేసే పనిలో ఉన్నారు. వాస్తవంగా అందుబాటులోకి వచ్చిన చోట స్థానికులకు సూపర్ మార్కెట్లలా ఈ మోడల్ మార్కెట్లు ఉపయోగపడాలి. కానీ మోడల్ భవనాలను ఏకంగా సీఎస్ఆర్ కింద ఫౌండేషన్లకు అప్పగిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు లభించేలా, ఉపాధి పొందేలా సహకరిస్తామని సదరు ఫౌండేషన్ బుధవారం జీహెచ్ఎంసీకి తెలియజేసింది.