శంషిగూడ ఇంద్రాహిల్స్ లోని ఓ ప్రైవేటు స్కూల్లో సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి విద్యార్థులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీశ్తో పాటు పాఠశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.