కూకట్ పల్లిలో పోలీసుల దాడులు

1526చూసినవారు
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్లో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల నుంచి చిన్న గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ ఫిల్ చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి గ్యాస్ సిలిండర్లతోపాటు ఫిల్లింగ్ సామగ్రిని సీజ్ చేశామని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్