కూకట్పల్లిలో యువతిని వేధించిన యువకుడు హత్యకు గురయ్యాడు. పవన్ అనే వ్యక్తి సోదరిని వేధించాడని వెంకటరమణతో గొడవకు దిగాడు. అక్కడికి వచ్చిన మరికొంత మంది ఫ్రెండ్స్ క్షణికావేశంలో అతడిపై దాడిచేశారు. ఈ క్రమంలో వెంకటరమణ తలపై పవన్ చపాతీ కర్రతో పలుమార్లు కొట్టాడు. గాయపడ్డ బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి స్వస్థలం AP కాకినాడ జిల్లా చిన్నయ్య పాలెంగా పోలీసులు గుర్తించారు.