తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల రూపాయల ఫీజు రీయంబర్స్ మెంట్స్ మరియు స్కాలర్ షిప్స్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ డిమాండ్ చేశారు. మేడ్చల్ మండలంలోని తహశిల్దార్ కార్యాలయం ముందు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం మేడ్చల్ డిప్యూటీ ఎమ్మార్వో సునీల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేసారు.