మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అరుణార్తి వెంకటరమణ శుక్రవారం మెట్రో రైల్ పైన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు చిత్రపటాలు ఏర్పాటు చేసి వినూత్నంగా జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. అనాధ పిల్లలకు మెట్రో రైల్లో ఉచిత ప్రయాణంతో పాటు పండ్లు, బిస్కెట్లు, స్కూల్ బ్యాగ్ కిట్స్ ను అందజేశారు. హైదరాబాద్ అసెంబ్లీ మెట్రో స్టేషన్లో అనాధ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి మైనంపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.