కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే నివాస వద్ద మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని శుక్రవారం కలిసి మేడ్చల్ ప్రాంతానికి మెట్రో సాధనలో కీలకంగా వ్యవహరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కీలకమైన కుత్బుల్లాపూర్ ప్రాంతం నుండి నిత్యం నగరానికి లక్షలాదిమంది ప్రయాణిస్తుంటారని అన్నారు.