మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్

50చూసినవారు
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్
రాష్ట్రంలో బీర్ల కొరతతో ఇబ్బందులు పడుతోన్న మద్యం ప్రియులకు మరో బ్యాడ్ న్యూస్. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. 17వ తేదీన శ్రీరామనవమి పండుగ సందర్భంగా జంట నగరాల్లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్