వేంకటేశ్వర నగర్ లోని జరుగుతున్న సీసీ రోడ్ పనులను నాయకులతో కలిసి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ పరిశీలించారు, త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ పనులు బీఅర్ఎస్ ప్రభుత్వంలో పనులు మంజూరు అయ్యాయని తెలిపారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.