ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ అభివృద్దే తన లక్ష్యమని, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో ఓల్డ్ బోయిన్ పల్లి ని, రాష్ట్రంలో నెంబర్ వన్ డివిజన్ గా తీర్చిదిద్దుతానని, ఓల్డ్ బోయిన్ పల్లీ డివిజన్ కార్పొరేటర్ ముద్ధం నరసింహ యాదవ్ అన్నారు.
గురువారం నాడు డివిజన్ లోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కలిసి, వల్లబ్ నగర్ లోని కాలనీ, బస్తీలలో పాదయాత్ర చేస్తూ, బస్తి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. వివిధ కాలనీలలో డ్రైనేజీ, కరెంటు పోల్స్, రోడ్లు, ట్రాన్స్ఫార్మర్ తదితర సమస్యను స్థానిక ప్రజలు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నిటిని అతి త్వరలో పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని కార్పొరేటర్ బస్తీల ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముద్ధం నరసింహ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంటు, పెన్షన్స్, అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని ఆయన తెలిపారు.
ఓల్డ్ బోయిన్ పల్లీ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, చిన్న పాట్టి సమస్యలను అతి త్వరలో పరిష్కారం అయ్యే దశగా చూస్తామని పేర్కొన్నారు. బస్తి, కాలనీలలో ఉండే సమస్యలను, తక్షణమే పరిష్కరించి, ఏ సమస్య వచ్చినా స్థానిక ప్రజలు ఫోన్ చేసిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలని కార్పొరేటర్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, ఏఈ అరవింద్ కుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, జిహెచ్ఎంసి సూపర్వైజర్ నవీన్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ తేజ, ప్రకాష్, సి. ఓ మైపాల్ రెడ్డి, ఏ. ఎస్సై, టి. పి. ఎస్. డిపార్ట్మెంట్ జస్వంత్, అర్బన్ డిపార్ట్మెంట్ నాగరాజు, స్వామి, శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కర్రే జంగయ్య, మన్నే ఉదయ్ యాదవ్, మల్లేష్ యాదవ్, బుర్రి యాదగిరి, చందు యాదవ్, మేకల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.