పద్మారావునగర్ రహదారులు కంపు..

54చూసినవారు
బన్సీలాల్పేట డివిజన్ పద్మారావునగర్ వెంకటాపురం కాలనీలో తరచుగా డ్రైనేజీ లీకింగ్లతో రహదారులు కంపు కొడుతున్నాయి. ఈ విషయమై గతంలో చాలా సార్లు జిహెచ్ఎంసి అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీ మురికి నీరు పొంగిపోతుండడంతో రహదారులపై నడవలేని పరిస్థితి ఉందని, దోమలు, కంపు వ్యాపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్