ముత్యాలమ్మ ఆలయం పై దాడి సంఘటనలో పోలీసులు ఏం పురోగతి సాధించారని మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ దీపిక ప్రశ్నించారు. ఆలయం వద్ద శుక్రవారం అమే మాట్లాడారు. దాడి జరిగి నెల రోజుకు కావోస్తున్న నిందితులకు ఇంకా శిక్ష పడలేదన్నారు. పార్టీలకు అతీతంగా ఒక హిందువుగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. కొంతమంది నాయకులు తమ మైలేజ్ కోసం ఆలయ సంఘటనను వాడుకుంటున్నారని ఆరోపించారు.