అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి అన్నారు. ఈ మేరకు వారసిగూడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మేకల సారంగపాణి పాల్గొని అన్నదాన వితరణ చేశారు. కార్యక్రమంలో అంబాల రాజు తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.