ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని బీజేపీని మరింత బలపరచాలని మహిళ మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డీ కోరారు. శనివారం తార్నాక డివిజన్ మహిళ మోర్చ అధ్యక్షురాలు అనిత అధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శిల్పారెడ్డీ హాజరయ్యారు. బీజేపీ పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.