జోనల్ కమిషనర్, ఇతర అధికారులతో మోండా మార్కెట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపికా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ఉగ్రనరసింహ ఆలయం, మసీదు ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లను పునరుద్ధరించాలని సూచించారు. కొత్తగా పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. దీనికి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.