చికిత్స పొందుతూ వివాహిత మృతి

65చూసినవారు
చికిత్స పొందుతూ వివాహిత మృతి
మిర్యాలగూడ మండలంలోని తుంగగూడకు చెందిన బొడ్డుపల్లి శివకోటయ్యవారి ఉప్పల్ లోని సత్యనగర్లో భార్య వాసవీ(30), నాలుగేళ్ల కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. ఈ తరుణంలో భార్యభర్తల మధ్య గొడవతో ఈనెల 25న వాసవీ ఇంట్లో ఉరేసుకోగా.. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి దామోదర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.