ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో ప్రతిభకు కొదవలేదని వారిలో సృజనాత్మకతను వెలికితీయడం ఉపాధ్యాయులతో పాటు మన అందిరి పైన ఆ భాద్యత ఉందని ఉప్పల్ బీజేపీ సీనియర్ నాయకులు గడ్డం సాయి కిరణ్ అన్నారు. ఈ సందర్భంగా రామంతాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థులకు సుప్ర ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.