గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీ టీ యు సి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి తార్నాక లోని డిప్యూటీ మేయర్ క్యాంప కార్యాలయంలో వివిధ అధికారులతో బతుకమ్మ, దసరా నవరాత్రుల సందర్భంగా డివిజన్లో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, పందిరులు, నీటి సౌకర్యాలు, భద్రత చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.