నేను ఆ అంకుల్‌ను పెళ్లి చేసుకుంటా..ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక

65512చూసినవారు
నేను ఆ అంకుల్‌ను పెళ్లి చేసుకుంటా..ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక
హైదరాబాద్‌ నగర శివార్లలో ఓ బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. హయత్‌నగర్ కుంట్లూరుకు చెందిన ఆమె ఫిబ్రవరి 18నుంచి కనిపించకుండా పోయింది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి వెళ్తున్నట్టు లెటర్ రాసి పెట్టింది. వివరాల్లోకి వెళ్తే కుంట్లూ‌రులో నివాసం ఉండే బాలిక హయత్‌నగర్‌లో ఓ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదువుతోంది. అయితే ఫిబ్రవరి 18న కిరాణా షాప్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయింది. రాత్రి అయినా తిరిగిరాకపోవడంతో తల్లిండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే బాలిక అదే గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యాదయ్యతో కలిసి కారులో వెళ్లిందని స్థానికులు తమకు చెప్పారని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న హయత్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయితే బాలికకు రియల్ ఎస్టేట్ వ్యాపారి యాదయ్యతో పరిచయం ఉందని పోలీసులు సైతం నిర్ధారించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో బాలిక రాసిన లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

"నాకు యాది అంకుల్ అంటే ఇష్టం. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అతను లేకుండా నేను ఉండలేను" అని బాలిక లేఖలో పేర్కొంది. అంతేకాదు అతనితో ఉన్న అనుబంధం గురించి ఇతరత్రా విషయాల గురించి కూడా ప్రస్తావించింది. ఐయామ్ సారీ అమ్మ.. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలంటూ తల్లిని కోరింది. ఇదిలా ఉంటే ఎవరితో అయితే వెళ్లిపోయిందని అనుమానిస్తున్న యాదయ్యకు ఇది వరకే పెళ్లి అయ్యింది. అతడికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాలిక అదృశ్యమైన రోజు నుంచే బాలిక కూడా అదృశ్యమవ్వడంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

సంబంధిత పోస్ట్