కాంగ్రెస్ అకౌంట్‌కు నాకు అసలు సంబంధమే లేదు: CM

68చూసినవారు
కాంగ్రెస్ అకౌంట్‌కు నాకు అసలు సంబంధమే లేదు: CM
కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల ఇష్యూలో ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించిన విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అసలు కాంగ్రెస్ అకౌంట్‌కు నాకు సంబంధమే లేదని తేల్చి చెప్పారు. అమిత్ షా ఫేక్‌ వీడియో తాను షేర్‌ చేయలేదని ఢిల్లీ పోలీసులకు రేవంత్ సమాధానం చెప్పారు. ఐఎన్‌సీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని స్పష్టత ఇచ్చారు. తాను సీఎంవో తెలంగాణ, వ్యక్తిగత ఖాతాను మాత్రమే వినియోగిస్తున్నానని చెప్పారు.

సంబంధిత పోస్ట్