కమలా హారిస్ తో జరిగే 2వ డిబేట్ లో పాల్గొంటాను: ట్రంప్

57చూసినవారు
కమలా హారిస్ తో జరిగే 2వ డిబేట్ లో పాల్గొంటాను: ట్రంప్
డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ తో రెండో డిబేట్ కు సిద్ధంగా లేనని US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశం పై ట్రంప్ మనసు మార్చుకున్నారు. “నేను రేపు చర్చలో పాల్గనగలను” అని అన్నారు. హారిస్ తో మీరు మరో డిబేట్ లో పాల్గొంటారా అనే ప్రశ్నకు ట్రంప్ 'నా మూడ్ బాగుంటే రేపే డిబేట్ లో పాల్గొంటానేమో' అని అన్నారు. అంతకుముందు కమలాతో జరిగిన చర్చలో తానే పైచేయి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్