AP: తిరుపతి స్విమ్స్ వద్ద స్వల్ప ఉద్రికత్త నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతుండగా హాస్పిటల్ వద్దకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేరుకున్నారు. అరగంట ఆలస్యంగా రావాలని.. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌ని పోలీసులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రైవేటు వాహనంలో హాస్పిటల్ వద్దకు జగన్ చేరుకున్నారు. హాస్పిటల్ వద్ద జై జగన్ అంటూ నినాదాలు.. మరోవైపు జై జనసేన అంటూ జనసైనికులు నినాదాలు చేశారు.