AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుపతిలో బాధితుల పరామర్శకు వస్తున్నారని ప్రభుత్వం కుట్ర చేసిందని వైసీపీ ఆరోపించింది. జగన్ వాహనానికి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయలేదని విమర్శించింది. దీంతో జగన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లారని ఓ వీడియోను వైసీపీ ట్వీట్టర్‌లో పోస్టు చేసింది. కొద్దిదూరం నడిచిన తర్వాత స్థానిక వైసీపీ నేత వాహనంలో జగన్ తిరుపతి స్విమ్స్‌కు చేరుకున్నారని తెలిపింది.