TG: దేవునూర్ అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మల్యే కడియం శ్రీహరి అన్నారు. దేవునూరు గుట్టలలో 2వేల ఎకరాలు ఆక్రమించాననే ఆరోపణలను ఆయన ఖండించారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, ఒకవేళ తాను కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్యల ఇళ్లలో గులాంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.