బీర్ రెగ్యూలర్‌గా తాగే అలవాటు ఉన్నవాళ్లకు దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు వస్తాయిని నిపుణులు చెబుతున్నారు. బీర్‌లోని ఆల్కహాల్ కారణంగా మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. దీంతో మెదడు కణాలు దెబ్బతింటాయి. దీని కారణంగా మెదడు సామర్థ్యం శాశ్వతంగా తగ్గుతుంది. ఫలితంగా ఆల్జైమర్స్ వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల బారిన పడతారు. చివరకు భావోద్వేగాలపై నియంత్రణ తగ్గి ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. అందుకే బీర్ తాగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.