వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు పోతాయట. ఏ వస్తువులు ఉంచాలో భోపాల్ జ్యోతిష్యుడు, వాస్తు కన్సల్టెంట్ పండిట్ హితేంద్ర కుమార్ శర్మ తెలిపారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్క, స్వస్తిక్ సంకేతం, గణేశ విగ్రహం, సూర్య యంత్రం ఉంటే ఎలాంటి ఆర్థిక సమస్యలు రావని చెప్పారు. సూర్య యంత్రం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేస్తుందట. స్వస్తిక్ సంకేతం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలను తొలగిపోతాయట.