ప్రతిరోజు ఉదయాన్నే బెల్లం నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. బెల్లం నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఖాళీ కడుపుతో బెల్లం నీళ్ళను తాగడం వలన మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.