రాగి పాత్రలోని నీరు తాగడం వల్ల మెదడు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రలో నీటిని 48 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది. రాగి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, అసిడిటీని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాగి వల్ల వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలు నయమవుతాయని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి.