ఎగువన కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా నిలిచిన నాగార్జునసాగర్ జలాశయం డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. డ్యామ్ గేట్లు ఎత్తడంతో పరుగులు తీస్తున్న కృష్ణమ్మ వీక్షకులకు అబ్బురపరుస్తుంది. ప్రస్తుతం 26 గేట్లు ఎత్తి 2.69 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.