మహరాష్ట్రలోని ఈ గ్రామంలో దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజిస్తారు

71చూసినవారు
మహరాష్ట్రలోని ఈ గ్రామంలో దసరా రోజు రావణుడిని దేవుడిగా పూజిస్తారు
దసరా రోజు భారత్‌లో రావణాసురుడి బొమ్మల్ని దగ్ధం చేస్తుంటారు. కానీ మహరాష్ట్రలోని అకోలా జిల్లా సంగోలా గ్రామంలో మాత్రం దసరా నాడు దశకంఠుడి నిలువెత్తు రూపాల్ని చేసి, ప్రజలు అందరూ మంగళ హారతులతో ఒక దగ్గర చేరి దశముఖుడిని పూజిస్తారు. ఈ ఆనవాయితీ 300 ఏళ్లుగా కొనసాగుతోంది. అంతేకాదు, ఆ ఊరి మధ్యలో నల్లరాయితో చేసిన పెద్ద రావణుడి విగ్రహం కూడా ఉంది.

సంబంధిత పోస్ట్