భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా ఏడు వారాలపాటు స్థిరమైన పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి.. 700 బిలియన్స్ దాటినట్లు RBI వెల్లడించింది. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పెరుగుదలలో ఇది ఒకటని పేర్కొంది. దీంతో ఈ విషయంలో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తరువాత ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది.