రాజస్థాన్‌లో ఓ పోలింగ్ బూత్ వద్ద అధికారిని ఓ అభ్యర్థి చెంపచెళ్లుమనిపించాడు. డియోలి ఉనియారా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న క్రమంలో స్వతంత్ర అభ్యర్థి నరేశ్ మీనా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడమే కాకుండా, ఎన్నికల ప్రొటోకాల్‌ను పర్యవేక్షించడానికి డ్యూటీ చేస్తున్న SDM అమిత్ చౌదరిని దారుణంగా కొట్టారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.