ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ యువకుడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఇద్దరు ట్రాన్స్జెండర్లు అసభ్యంగా పవర్తించారు. మెట్రో రైలులో ఇద్దరు ట్రాన్స్జెండర్లు ప్రయాణికులను డబ్బులు అడుగుతున్నారు. అయితే ఓ యువకుడు మాత్రం వారికి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన ట్రాన్స్జెండర్లు అతడిపై వాగ్వాదానికి దిగారు. చివరికి దుస్తులు తీసేసి అసభ్యంగా ప్రవర్తించారు.