వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి విడదల రజినికి బిగ్ షాక్ తగిలింది. అక్రమ కేసులతో తనను వేధించారని విడదల రజిని, అప్పటి చిలకలూరిపేట అర్బన్ సీఐపై ఐటీడీపీ చిలకలూరిపేట అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు ఆరోపణలు చేశారు. ఈ మేరకు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ పోస్టులు పెట్టారని, పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.