భారత్ పర్యటన వాయిదా.. చైనాకు వెళ్లిన మస్క్

77చూసినవారు
భారత్ పర్యటన వాయిదా.. చైనాకు వెళ్లిన మస్క్
భారత్‌లో పర్యటనను వాయిదా వేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చైనా పర్యటనకు వెళ్లారు. బీజింగ్‌లో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులతో మస్క్ భేటీ కానున్నట్లు సమాచారం. చైనాలో టెస్లా కార్ల విక్రయాలు పడిపోవడం, ఇటీవల కార్ల ధరలను కంపెనీ తగ్గించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ దేశంలో 'ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్' వ్యవస్థను ప్రవేశపెట్టడం, కస్టమర్ల డేటా బదిలీ వంటి అంశాలపై ఆయన చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :